వర్శిటీ భూముల కబ్జా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కోసం 250 ఎకరాల స్థలాన్ని అప్పగించడం పట్ల యుఒహెచ్ విద్యార్థులు, సిబ్బంది ఈ వారారంభంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనితో అధికారులు ఈ ప్రతిపాదనపై పునరాలోచన చేస్తున్నారు. ఇక ఒయులో విశ్వవిద్యాలయం స్థలం భూ కబ్జాదారుల పరం కావడమే కాకుండా ఒయు సిబ్బంది, అక్కడ పని చేస్తున్న నిర్మాణ కార్మికుల అక్రమ ఆక్రమణకు కూడా గురైంది. భూ కబ్జాదారులు ఆ ప్రాంతంలో షాపింగ్ మాల్స్, నివాస భవనాల సముదాయాలను నిర్మించారు.
తిరుపతిలో ఎస్ వి విశ్వవిద్యాలయం అధికారుల సమాచారం ప్రకారం, చివరకు స్థానికులు కూడా విశ్వవిద్యాలయం స్థలాన్ని కబ్జా చేశారు. 'తుదకు రిటైరైన విశ్వవిద్యాలయం ఉద్యోగులు కూడా కాంపస్ లోనే ఇళ్లు నిర్మించుకున్నారు. వారిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు' అని ఒక అధికారి చెప్పారు. యుఒహెచ్ లో యాజమాన్యం విస్తార ప్రాంతాన్ని వివిధ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు లీజుకు ఇచ్చింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం యుఒహెచ్ స్థలంలో నుంచి కొన్ని ఐటి పార్కులకు, వాణిజ్య సముదాయాలకు కేటాయింపులు జరిపింది. 'గడచిన ఐదేళ్లలోనే కాంపస్ 621 ఎకరాలను కోల్పోయింది. విద్యావసరాలకు వర్శిటీ వద్ద ఇంకా కావాలన్ని స్థలం ఏదీ లేదు' అని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ పి. అప్పారావు చెప్పారు.
ఈ విశ్వవిద్యాలయాల వ్యవస్థాపకుల కలలు ఇప్పుడు ఎవరికీ గుర్తు లేవని సీనియర్ విద్యావేత్తలు అంటున్నారు. 'విజ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఈ విద్యా సంస్థలను నిర్మించారు. కాని. అధికారులు ఈ విశ్వవిద్యాలయాల వృద్ధిని రిస్క్ లోకి నెడుతున్నారు' అని యుఒహెచ్ అకడమిక్ స్టాఫ్ కాలేజి డైరెక్టర్ ప్రొఫెసర్ వై. నరసింహులు అన్నారు. విశ్వవిద్యాలయాలు మరింతగా స్థలం నష్టపోతే వాటి అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు.
Pages: -1- 2 News Posted: 12 February, 2010
|