యుఐడిలో ఐటి ప్రొఫెషనల్స్ 'ఈ డేటా దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ నెట్ వర్క్ లలో కూడా లభిస్తుంది. దీనిని ఏ మొబైల్ హాండ్ సెట్లలో లేదా ఆన్ లైన్ లో సరి చూసుకోవచ్చు లేదా సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లో నిక్షిప్తం చేయవచ్చు' అని నీలేకని సూచించారు. లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ సిస్టమ్ లలో కంపెనీలు ఆరోగ్య రక్షణ వంటి నిర్దుష్ట అవసరాలకు ఉపయోగించే అప్లికేషన్లను రూపొందించుకోవచ్చు' అని ఆయన అన్నారు.
దేశంలో అంతర్లీనంగా ఉన్న సవాళ్ల కారణంగా పేర్ల నమోదు సమయంలోనే ఎక్కువగా సమస్యలు తలెత్తవచ్చునని ఆయన అంగీకరించారు. ఈ ప్రాజెక్టు కనుక విజయవంతమైతే ఐటి పరిశ్రమకు దండిగా లాభాలు ఆర్జించగలదని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున హార్డ్ వేర్ మార్కెట్ కు ఊతం ఇస్తుందని, ఎందుకంటే పరికరాల, ఐరిస్ స్కానర్లు, బయోమెట్రిక్ సాధనాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడగలదని నీలేకని చెప్పారు. ప్రభుత్వం 2009 - 10 సంవత్సరానికి యుఐడి ప్రాజెక్టు కోసం రూ. 120 కోట్లు కేటాయించింది.
Pages: -1- 2 News Posted: 12 February, 2010
|