మళ్ళీ 'సూపర్' సోనియా?
మొదటి యుపిఎ హయాంలో ఎన్ఆర్ఇజిఎ వలె రెండవ హయాంలో 'ఆమ్ ఆద్మీ' నినాదానికి ఎఫ్ఎస్ఎ గుర్తు (మస్కట్)గా మారింది. పార్టీ విధానాల జాబితాలో తరువాతి ప్రధాన అంశం మత కల్లోలాల నిరోధక బిల్లు. బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు జరుపుతున్న లిబర్హాన్ కమిషన్ నివేదికకు సంబంధించి కార్యాచరణ నివేదిక (ఎటిఆర్) ప్రస్తావన చేసిన తరువాత ఈ ప్రతిపాదిత చట్టానికి ఊపిరి లభించింది. కీలకమైన ఈ రెండు చట్టాలు రెండవ అవతారంలో ఎన్ఎసికి బలం చేకూర్చవచ్చు.
ఎంఎన్ఆర్ఇజిఎలో తీసుకువచ్చిన మార్పులు ఉద్యోగ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయని పౌర సంఘాల కార్యకర్తలు నిరసన తెలియజేయసాగారు. ఆ భయాలను ప్రభుత్వం పారదోలలేకపోవడం పార్టీని కలవరపరిచింది. ఎఫ్ఎస్ఎ, మత కల్లోలాల నిరోధక బిల్లు వంటి 'ఆమ్ ఆద్మీ' చర్యలు తీసుకోవడంలో జాప్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలే ఇప్పుడు ఎన్ఎసి పునరుద్ధణకు దారి తీసి ఉండవచ్చు.
కాంగ్రెస్ రాజకీయ వ్యూహంతోనే 2004లో ఎన్ఎసికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వానికి 'ఆమ్ ఆద్మీ' ముసుగు ఉండగా, విధాన రూపకల్పనలో పౌర సంస్థల భాగస్వామ్యంతో సమాజంలో అసంతృప్తిని పార్టీ పారదోలవచ్చునని భావించారు. సమాచార హక్కు చట్టం, గ్రామీణ పేదల అనుకూల పథకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఇజిఎస్), అటవీ హక్కుల చట్టం వంటివి తీసుకురావడంలో ఎన్ఎసి పోషించిన పాత్ర వల్ల కాంగ్రెస్ కు పేదల అనుకూలమైనదననే ముద్ర పడింది.
ఎన్ఎసి లేకపోవడం వల్ల విధానపరమైన అంశాలపై మంత్రిత్వశాఖలే తగిన కృషి సాగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతించింది. పార్టీ అందజేసిన సమాచారంతో ముసాయిదాలను రూపొందించవలసిందిగా సీనియర్ నాయకులను కోరారు. అయితే, అంతరాలు కొనసాగాయి. చరిత్రాత్మకమైన విద్యా హక్కు చట్టంపైనే వికలాంగుల సంక్షేమ సంస్థల నాయకులు విమర్శలు చేశారు. ఈ చట్టం వికలాంగుల విషయం పట్టించుకోవడం లేదని వారన్నారు.
ఎన్ఎసి సామాజిక సంస్థల నాయకులతో నిరంతరం చర్చలు సాగిస్తుంటే రాజకీయంగా మేలు కలుగుతుందని కూడా భావించారు.
Pages: -1- 2 News Posted: 13 February, 2010
|