మృదువుగా క్రూరత్వం అతను 1990 దశకం ఆరంభంలో బీహార్ లోకి ప్రవేశించాడు. బీహార్ అప్పట్లో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసిసిఐ)కి బలమైన స్థావరంగా ఉండేది. ఈ రెండు తీవ్రవాద దళాల విలీనం కోసం కిషన్ జీ పూనుకున్నాడు. భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ, అతను 2004లో పీపుల్స్ వార్, ఎంసిసిఐల ఏకీకరణలో కృతకృత్యుడయ్యాడు. ఈ క్రమంలో అతను బెంగాల్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలోకి ప్రవేశించాడు. అతను త్వరగానే తన దూకుడు ధోరణిని, అధికార వ్యామోహాన్ని ప్రదర్శించాడు. బెంగాల్ లో మావోయిస్టు నాయకులను పక్కకు నెట్టాడని, తనకు గిట్టని పలువురు సీనియర్ నాయకులను బహిష్కరించాడని కిషన్ జీపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తూర్పు ప్రాంతంలో గణపతి తరువాత ఎదురులేని నాయకుడుగా రెండవ స్థానంలో ఉన్నాడు.
అతను తాను కోరుకున్నది సాధించగలడని పార్టీ ఆంతరంగికులు చెబుతుంటారు. అతను ఒకసారి ఒక మహాసభలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాణికి దాపై చేయి చేసుకున్నాడు. ఇక మీడియాను ఉపయోగించుకోవడంలో తాను ప్రవీణుడినని అతను నిరూపించుకున్నాడు. అతను జర్నలిస్టుల నుంచి వచ్చే కాల్స్ ను వెంటనే అందుకుంటాడు, తన ముఖం కప్పుకుని, వీపు కనిపించేట్లుగా కెమేరాకు పోజు ఇస్తుంటాడు. కొన్ని సందర్భాలలో ఒక ఎన్ కౌంటర్ మధ్యలో అతనిని కలుసుకున్నప్పుడు జర్నలిస్టులకు నేపథ్యంలో తుపాకి శబ్దాలు వినిపించాయి కూడా.
Pages: -1- 2 News Posted: 17 February, 2010
|