డాక్టర్లకు నీతి ..కాని? అయితే, నైతిక ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లుగా తేలిన డాక్టర్లపై చర్య తీసుకునే అధికారాన్ని వైద్య మండలులకు దత్తం చేసినట్లు ఎంసిఐ అధ్యక్షుడు కేతన్ దేశాయి తెలియజేశారు. పరిశ్రమ కూడా అటువంటి పద్ధతులను అరికట్టవలసిన అగత్యం ఉందని ఆయన సూచించారు. పరిశ్రమ ఇక డాక్టర్లకు చెక్కుల ద్వారా చెల్లింపులు జరిపే పద్ధతి నుంచి నగదు అందజేసే పద్ధతిని అనుసరించవలసి ఉంటుందని పరిశ్రమ ప్రతినిధి తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు.
అయితే, వైద్య సదస్సులకు ఆహ్వానించిన వక్తలను సాయం అందుకోవడానికి అనుమతిస్తున్న గైడ్ లైన్లలోని క్లాజుల పట్ల కొందరు డాక్టర్లు అసంతుష్టి ప్రకటించారు. వ్యష్టిగా కన్నా డాక్టర్ల సంఘాలు నిధులను స్వీకరింి, వాటిని వ్యక్తిగత డాక్టర్లకు సాయం చేయడానికి ఉపయోగించవచ్చునని, ఆవిధంగా ప్రస్తుత మార్గదర్శక సూత్రాలను తోసిరాజనవచ్చునని కూడా ఈ సదస్సులో ఒక డాక్టర్ హెచ్చరించారు. 'అలా చేయడం మొదలైనట్లయితే, మనం మన మార్గదర్శక సూత్రాలను తిరిగి రూపొందించుకోవలసి ఉంటుంది' అని దేశాయి అన్నారు.
Pages: -1- 2 News Posted: 17 February, 2010
|