రోశయ్యకు 'వాస్తు' రక్ష ముఖ్యమంత్రి రోశయ్య ప్రస్తుతం ధరం కరం రోడ్డులో నివసిస్తున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన బేగంపేటలోని క్యాంపు కార్యాలయానికి రోశయ్య మారాల్సి ఉంది. అయితే దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మారణం తరువాత ఆయన కుమారుడు వై ఎస్ జగన్ కొద్దిరోజులు ఇదే క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. తరువాత ఆయన బంజారాహిల్స్ లో రోడ్ నంబర్ -2లో నివాసం ఉంటున్న తన చెల్లెలు షర్మిళ ఇంటికి మరారు.అప్పటి నుండి క్యాంపు ఆఫీసు ఖాళీగానే ఉంది. పండితుల ఇచ్చిన సలహాకు అనుగుణంగా క్యాంపు కార్యాలయానికి వాస్తు మార్పులు వేగంగా జరుగుతున్నాయి.రోశయ్యకు వాస్తు పట్ల ఎంతో విశ్వాశం ఉండటంతో ఆయన పండితుల సలహాలను యథాప్రకారం సాగేలా శ్రద్థ తీసుకుంటున్నారు.
సీ ఎం లక్కు మార్చే మార్పులను రోడ్లు, భవనాల మంత్రిత్వ శాఖ అధికారులు అత్యంత భయభక్తులతో సాగిస్తున్నారు. వాస్తు సలహా ప్రకారం క్యాంపు కార్యాలయానికి ఆగ్నేయంగా ఉన్న సెక్యూరిటీ విభాగాన్ని ప్రహరీకి బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే క్యాంప్ ఆఫీసు పోర్టికో ని దక్షిణం దిశ వైపు మరింతగా విస్తరిస్తున్నారు. సీఎం నివాసానికి, క్యాంపు ఆఫీసుకు మధ్య గల గేటును కూడా ఇక మూసివేస్తున్నారు. ఆఫీసులో ఆగ్నేయ దిశలో డైమండ్ ఆకారంలో చిన్న రూమ్ ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. దీనికి అనుగుణంగా క్యాంపు ఆఫీసు భవనానికి ఆగ్నేయంగా కూడా మరో చిన్న భవనాన్ని కడుతున్నారు. అంతేగాక పబ్లిక్ మీటింగ్ షెడ్డు ఎడమవైపు విస్తీర్ణాన్ని కాస్త తగ్గిస్తున్నారు. క్యాంపు ఆఫీసుకు వెనుకవైపు ఉన్న పోర్టికోని పూర్తిగా తొలగిస్తున్నారు.
ఈ వాస్తు మార్పులన్నీ పూర్తి కాగానే మార్చి 16 తెలుగు ప్రజల కొత్త సంవత్సరాది పర్వదినాన రోశయ్య క్యాంపు ఆఫీసులోకి ప్రవేశించనున్నారు. మారిన క్యాంపు ఆఫీసు వాస్తు రోశయ్య లక్కు ను మారుస్తుందో లేదో చూడాలి మరి.
Pages: -1- 2 News Posted: 18 February, 2010
|