కాంగ్రెస్ ఖర్చు 380 కోట్లు రాజకీయ పార్టీలు ఎన్నికలను ఆకాశమార్గం పట్టించడం ముఖ్యాంశం. ఎలా అంటే ఎన్నికల ఖర్చులో అధిక భాగం విమానాలను, హెలికాప్టర్ లను అద్దె గా ఉంటోంది. జాతీయ స్థాయి నాయకులు దేశంలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ఎన్నికల ప్రచారం చేయడానికి వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 113 కోట్ల 56 లక్షల రూపాయలను విమానాలకు, హెలికాప్టర్లకు చెల్లించిన అద్దెగా తన ఎన్నికల ఖర్చులో చూపించింది. అలానే జయలలిత ప్రచారం కోసం తీసుకున్న హెలికాప్టర్ల అద్దె ఖర్చే ఎఐఎడిఎంకె ఎన్నికల ఖర్చులో సగానికి పైగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధుల్లో చాలామందికి 10 లక్షల రూపాయల చొప్పున డబ్బులు కూడా పంపిణీ చేసింది. కేంద్ర నాయకత్వం సొమ్ములు సరఫరా చేయడం అనేది కాంగ్రెస్ సంస్కృతిలో భాగం అయిపోయింది. దానిని ఒక విధానంగా కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి అమలు చేస్తోంది. వామపక్షాలు కూడా ఇలా డబ్బుల పంపిణీ చేస్తుంది కానీ మొత్తాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఎన్నికల్లోఆసక్తిని కలిగించే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. 2009 ఎన్నికల సందర్భంగా మాయావతి బహుజన సమాజ్ పార్టీ మరింత సంపన్న పార్టీగా మారింది. దాని ఆస్తులు 14 కోట్ల మేరకు పెరిగాయి. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందు ఆ పార్టీ తన ఆస్తుల విలువ 118 కోట్లుగా లెక్కలు చూపింది. ఒక రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న బిఎస్ పి బాగానే సొమ్ములు సంపాదించుకుంది. ఎన్నికల ఖర్చంతా జాతీయ కార్యలయం నుంచే చేసినట్లుగా బిఎస్ పి వివరించింది. కానీ అది ఉత్తర ప్రదేశ్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదట. అయితే మాత్రం 21 పార్లమెంట్ స్థానాల్లో 20 సీట్లను కైవసం చేసుకుంది. సిపిఎం, సిపిఐ పార్టీలు తమ నిధులను రాష్ట్ర, జిల్లా కమిటీల ద్వారా ఖర్చు చేసినట్లు పేర్కొన్నాయి.
Pages: -1- 2 News Posted: 18 February, 2010
|