సామరస్యమా? సమరమా? ఇది బేల్ పహాడికి సమీపంలో ఉంది. దీని చుట్టూ ఝార్ఖండ్ లో పచపానీ, మధుపూర్, జోవి గ్రామాలు, బెంగాల్ లో జోర్మా, లబాని, చౌకీషోల్ గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని పాత గెరిల్లా శిబిరాలలో ఒకటైన ఈ రహస్య స్థావరాన్ని సాయుధ మావోయిస్టులు డజన్ల సంఖ్యలో సదా పరివేష్టించి ఉంటారు.
కల్లోలిత మండలాల్లో సాయుధ బలగాలను నియంత్రించిన పక్షంలోనే తాము చర్చల్లో పాల్గొంటామని కేంద్ర కమిటీ ఇంతకాలం స్పష్టం చేస్తూ వచ్చింది. సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి గణపతి ప్రభుత్వానికి మూడు షరతులు విధించాడు. సాయుధ బలగాలను ఉపసంహరించాలని, జైలు నుంచి మావోయిస్టులను విడుదల చేయాలని, పార్టీపై నిషేధం ఉపసంహరించాలని అతను కోరాడు. ఈ ప్రాంతంలో అగ్రశ్రేణి మావోయిస్ట్ నాయకుడు కిషన్ జీ ఆయన షరతులకు మద్దతు ప్రకటించాడు. ఈ దంశలో కేంద్రంతో లేదా రాష్ట్రంతో చర్చలు జరపడం ఆత్మహత్యా సదృశం కాగలదని కిషన్ జీ అభిప్రాయం వెలిబుచ్చాడు. నేపాల్ లో మావోయిస్టులు అధికారంలోకి వచ్చిన తరువాత 'మారిపోయిన' తీరును అతను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు.
మరొకవైపు ప్రజలు పడుతున్న కష్టాల గురించి గోపీనాథ్ జీ ప్రస్తావించాడు. గత ఏడాదిన్నరగా జంగల్ మహల్ లో, ముఖ్యంగా లాల్ గఢ్, పరిసర ప్రాంతాలలో ప్రజలు ఈ అటవీ పోరు వల్ల తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని అతను వాదించాడు. మావోయిస్టులు తమ దాడులు ఉధృతం చేసినట్లయితే, అది స్థానికుల ప్రయోజనాలకే విరుద్ధం కాగలదని అతను హెచ్చరించాడు. గ్రామస్థుల దుస్థితికి తీవ్రవాదులే బాధ్యులనే నిందలు వస్తాయని, జనం మద్దతును కోల్పోవలసి వస్తుందని అతను అభిప్రాయం వెలిబుచ్చాడు. ఇప్పటికే గ్రామస్థులలో అధిక సంఖ్యాకులు మావోయిస్టుల పట్ల ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. దీర్ఘకాలంగా సాగుతున్న ఈ పోరు వల్ల తమ జీవనోపాధి దెబ్బ తిన్నదని, తమ జీవితం అస్తవ్యస్తం అయిందని వారు అంటున్నారు.
Pages: -1- 2 News Posted: 22 February, 2010
|