మెట్రోరైల్ బిడ్లకు శ్రీకారం ఆషామాషీ అభ్యర్థులను నిరుత్సాహపరచడానికై బిడ్ సెక్యూరిటీ మొత్తం (బిఎస్ఎ)ని పూర్వపు రూ. 60 కోట్ల నుంచి రూ. 240 కోట్లు (ప్రాజెక్టు వ్యయంలో రెండు శాతం)కు పెంచారు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ (పిఎస్ డి)ని పూర్వపు రూ. 240 కోట్ల నుంచి రూ. 360 కోట్లకు పెంచారు. బిడ్డర్లు ఆర్థిక బిడ్ లతో పాటు బిఎస్ఎని హెచ్ఎంఆర్ కు చెల్లించవలసి ఉంటుంది.అయితే, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ మొత్తాన్ని ఫైనాన్షియల్ క్లోజర్ సమయంలో చెల్లించవచ్చు.
ఇది ఇలా ఉండగా, ఎంఎయుడి జారీ చేసిన జిఒ ప్రకారం, ఆర్ఎఫ్ పి జారీ తేదీ నుంచి ఒక నెలలోగా సోమా ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఉమ్మడి సీల్ కింద సరికొత్త ధ్రువీకరణ పవర్ ఆఫ్ అటార్నీ (పిఒఎ)ని సమర్పించాలనే షరతుపైనే సోమా - స్ట్రాబాగ్ ఎజి (ఆస్ట్రియా) కన్సార్షియం ప్రీక్వాలిఫికేషన్ ఆధారపడి ఉంటుంది. మరొక అభ్యర్థి సంస్థ ట్రాన్స్ స్ట్రాయ్ - ఒజెఎస్ సి ట్రాన్స్ స్ట్రాయ్ - సిఆర్ 18జి - బిఇఎంఎల్ కన్సార్షియం అవసరమైన సమర్థన పత్రాలు, కంపెనీ ఉమ్మడి సీల్ కింద బిఇఎంఎల్ సరికొత్త ధ్రువీకరణ పిఒఎని సమర్పించవలసి ఉంటుంది.ఆర్ఎఫ్ క్యూ ప్రకారం నికర విలువకు దాఖలాగా చట్టబద్ధమైన ఆడిటర్ సర్టిఫికెట్ తో పాటు 2008 సంవత్సరానికి చైనా రైల్వే నిర్మాణ సంస్థ (సిఆర్ సిసి)కి చెందిన ఆడిట్ చేసిన వార్షిక అకౌంట్లను కూడా ఈ కన్సార్షయం ఒక నెలలోగా సమర్పించవలసి ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 24 February, 2010
|