ఐపీఎల్ 'పరీక్ష'లు 'మా అమ్మాయి రచన మార్చి నెలలో జరిగే పదో తరగతి పరీక్షలు రాయనుంది. అయితే తాను, నేను కూడా అమితంగా ఇష్టపడే ఐపీఎల్ మ్యాచ్ లు కూడా ఈ సమయంలోనే జరుగుతున్నాయి. పరీక్షలు ముఖ్యం కనుక మ్యాచ్ లను చూడరాదని నిర్ణయించుకున్నాం. ఈ సమయంలో నేను పుస్తకాలు చదవడం, ప్రత్యేక వంటకాలు చేయాలని ప్లాన్ చేసాను. నేను వంట చేస్తే పరీక్షల ప్రిపరేషన్ లో అలసిపోయే మా అమ్మాయికి కూడా పోషకాహారం లభిస్తుంది' అని హైదరాబాద్ లోని ఓ ఎయిర్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్న చంద్రికా రామనాథన్ చెప్పారు. ఐపీఎల్ ను అమితంగా ఇష్టపడే తన భర్త తొలుత విచారించినా, తరువాత స్నేహితులతో కలసి క్లబ్ లో మ్యాచ్ లను వీక్షించాలని నిర్ణయించుకున్నారని ఆమె వివరించారు.
అలాగే ఐపీఎల్ కోసం ఎప్పటి నుండో వేచి చూస్తోన్న సునీతా సురేష్ లు కూడా ఈ సారి నిరాశ తప్పలేదు. వారి కుమారుడు ఆదర్శ్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నాడు. 'మార్చిలో పరీక్షలు జరుగుతున్నందున ఇంట్లో మ్యాచ్ లు చూసే అవకాశం లేదు. అదృష్టశావత్తు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లు ఏప్రిల్ జరుగుతున్నాయి . అప్పటికి మావాడి పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి నేను అప్పుడే చూస్తాను. మార్చీలో మాత్రం ఇంట్లో టీవీ ఆనే చేసే అవకాశం లేనందున లైబ్రరీకి వెళ్లి బుక్స్ చదువుతూ కాలక్షేపం చేయాలని నిర్ణయించా' అని సునీతా సురేష్ చెప్పారు. అలాగే మహాలక్ష్మీ అనే మరో గృహిణి కూడా మాట్లాడుతూ, తమ కుమార్తె శృతి పదో తరగతి పరీక్షలు రాస్తున్నందున ఆమెను డిస్ట్రబ్ చేయరాదని నిర్ణయించానని వెల్లడించారు. ఈ సమయంలో తాను ఫిట్ నెస్ సెంటర్లో వ్యాయమ శిక్షణ పోందుతానని వివరించారు.
మొత్తానికి విద్యార్థులకు పరీక్షల సంగతెలా ఉన్నా, ఐపీఎల్ మాత్రం చాలామంది తల్లితండ్రులకు విషమ పరీక్షనే పెట్టింది.
Pages: -1- 2 News Posted: 25 February, 2010
|