ఫోన్ల మంత్రికి గండం? ప్రభుత్వ అజమాయిషీలోని ఈ టెలిఫోన్ సంస్థ తనకు ఇప్పుడున్న నెట్ వర్క్ పూర్తి సామర్థ్యానికి చేరుకున్న దశలో కూడా మొబైల్ నెట్ వర్క్ లకు, పరికరాలకు కొత్త ప్రధాన కాంట్రాక్టులు వేటినీ ఇవ్వనందుకు నివేదిక విమర్శించినట్లు ఆయన తెలిపారు. తనకు ముందుగా కేటాయించిన 3జి, వైమాక్స్ స్పెక్ట్రమ్ వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సంస్థ సద్వినియోగం చేసుకోలేకపోయిందని నివేదిక పేర్కొన్నదని ఆ వర్గాలు తెలియజేశాయి. ప్రైవేట్ రంగ సంస్థల కన్నా ముందుగానే 3జి, వైమాక్స్ స్పెక్ట్రమ్ ను బిఎస్ఎన్ఎల్ కు కేటాయించారు.
ఇదే రీతిలో సంస్థను కార్యకలాపాలను సాగించనిస్తే, గ్రామీణ ప్రాంతాలలో ప్రజా సంక్షేమం, ఇ-పాలన, ఆరోగ్య సేవలు, ప్రాథమిక విద్య వంటి రంగాలలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు దెబ్బ తింటాయని నివేదిక హెచ్చరించింది. (గ్రామీణ ప్రాంతాలలో మొబైల్ సేవలు అందించేది బిఎస్ఎన్ఎల్ ఒక్కటే.) సంస్థ పని తీరును మెరుగుపరచుకోవడానికి బదులు ఎవరో కొందరు విక్రేతలకు అనుకూలంగా టెండర్ ప్రక్రియ సాగేట్లు చూస్తున్నందుకు బిఎస్ఎన్ఎల్ యాజమాన్యాన్ని నివేదిక దుయ్యబట్టినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
ఇది ఇలా ఉండగా, ఫోన్ వినియోగదారుల సంఖ్య పరంగా మార్కెట్ లో బిఎస్ఎన్ఎల్ స్థానం ఇటీవలి కాలంలో పతనమైంది. తన ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే కొత్త యూజర్లను ఎక్కువ మందిని బిఎస్ఎన్ఎల్ చేర్చుకోలేకపోయింది.
నోకియా వంటి భారీ టెలికమ్ సంస్థలను కాదని హువావై వంటి చైనీస్ సంస్థల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించడం ద్వారా దేశ భద్రత విషయంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థ రాజీ పడుతున్నదని కూడా నివేదిక ఆరోపించినట్లు డిఒటి ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వచ్చిన హెచ్చరికలను, సంకేతాలను బిఎస్ఎన్ఎల్ అలక్ష్యం చేసిందని, రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాలలో వైమాక్స్ పరికరాల కోసం ఇప్పటికీ హువావై సంస్థనే ఈ సంస్థ ఇష్టపడుతున్నదని కూడా నివేదిక ఆరోపించింది.
Pages: -1- 2 News Posted: 26 February, 2010
|