సూపర్ చోరుడు! 'సుభాష్ సూపర్ చోరుడుగా పేరొందాడు. అతను నిరుడు జనవరిలో బెయిలుపై విడుదలయ్యాడు. అతను ఖరీదైన దుస్తులు ధరిస్తుంటాడు. విలాసవంతమన జీవితంపై అతనికి మోజు ఉన్నది. అతను బ్లూ లెవెల్ విస్కీ మాత్రమే సేవిస్తాడు, అత్యాధునిక కార్లను, బైక్ లను ఉపయోగిస్తాడు. అతనికి పలువురు గర్ల్ ఫ్రెండ్ లు ఉన్నారు' అని డిసిపి (సౌత్) హెచ్.జి.ఎస్. ధలివాల్ తెలియజేశారు.
రెండవ, మూడవ అంతస్తులలోని రెసిడెన్షియల్ ఫ్లాట్లనే సుభాష్ ఎక్కువగా లక్ష్యంగా ఎంచుకుని, నగదు, నగలు అపహరిస్తుంటాడని పోలీసులు తెలిపారు. బయట నుంచి తాళం వేసిన ఇళ్ళలో మాత్రమే అతను చోరీకి పాల్పడుతుంటాడు. 'నిరుడు జైలులో నుంచి విడుదలైన అనంతరం అతను యుపిలోని మథురలో స్థిరపడ్డాడు. ఢిల్లీలో అతను ఒక అపార్ట్ మెంట్ ను అద్దెకు తీసుకున్నాడు. అతనికి మరి రెండు రహస్య స్థావరాలు కూడా ఉన్నాయి' అని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
సుభాష్ మథురలో రాజకీయాలలో పాల్గొన్నాడని, ఆస్తుల డీలర్ గా తనను తాను ప్రచారం చేసుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. 'ఖోడా గ్రామం నుంచి ప్రధాన్ పదవికి పోటీ చేయాలని అతను కోరుకున్నాడు' అని పోలీసు అధికారి చెప్పారు. కాగా, అతను గ్రామంలో సమాజ సేవ కార్యక్రమాలలో సుమారు రూ. 6 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను బాలికల వివాహానికి డబ్బు ఇచ్చాడు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా గ్రామస్థులకు అతను 300 దుప్పట్లు పంచాడు. సుభాష్ మొదటిసారి 1997లో కల్కాజిలో ఒక సిలిండర్ దొంగతనం కేసులో అరెస్టయ్యాడు. 2007లో దక్షిణ జిల్లా ప్రత్యేక సిబ్బంది ఒక ఎన్ డిపిఎస్ కేసులో అతనిని అరెస్టు చేశారు.
Pages: -1- 2 News Posted: 26 February, 2010
|