ప్రణబ్ పై దీదీ ఆగ్రహం భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల సమాఖ్య (ఎఫ్ఐసిసిఐ) ప్రధాన కార్యదర్శి, రైల్వేల నిపుణుల కమిటీ చైర్మన్ అమిత్ మిత్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'బడ్జెట్ ప్రసంగం గాని, ఆర్థిక బిల్లు గాని నాకు ఆశ్చర్యం కలిగించలేదు. కాని కనీసం రూ. 6000 కోట్ల మేరకు భారం ఉంటుందని ఆర్థిక బిల్లులో సూచించడం ఆశ్చర్యం కలిగించింది. మరెవరో ఇది భరించవలసి ఉంటుంది. రైల్వే శాఖ ఈ భారాన్ని వినియోగదారులపైకి నెట్టవచ్చు. ఇది ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది' అని చెప్పారు.
కాగా, ఆగ్రహం చెందిన మమత బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే కోలకతాకు బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ, తృణమూల్ కాంగ్రెస్ పెట్రోలియం ధరల హెచ్చింపు పట్ల నిరసనగా ప్రతిపక్షాలతో చేతులు కలపాలని ఇప్పుడు నిర్ణయించుకుంది. 'పెట్రోల్ ధర హెచ్చింపు మాకేమీ సంతోషంగా లేదు. పార్టీ సంతోషించడం లేదు. ఆ హెచ్చింపు నిర్ణయాన్ని ఉపసంహరించాలి' అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సుదీప్ బందోపాధ్యాయ అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన తన మిత్రపక్షంతో రాజకీయ స్పర్థకు దిగుతున్నట్లు కనిపిస్తున్నది. మమత ఉత్సాహాన్ని నీరు గార్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అధికార కూటమికి సంక్లిష్ట స్థితిని తీసుకురావచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పుడు సంఘటితమయ్యాయి.
Pages: -1- 2 News Posted: 27 February, 2010
|