మళ్లీ 'పిల్' యాడ్స్ 2005 సెప్టెంబర్ నుంచి ఇండియాలో ఏడు విభిన్న సంస్థలు ఈ గర్భనిరోధక మాత్రలను మార్కెట్ చేస్తున్నాయి. వీటిని మందుల షాపులలో (ఒటిసిలలో) డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నారు. అయితే, డిటిఎబి ఒటిసి ప్రతిపత్తిని ఉపసంహరించలేదు. ఎందుకంటే ఐ-పిల్స్ కొనుగోలుకు ప్రిస్క్రిప్షన్ కోసం డాక్టర్ వెళ్లాలని మహిళలు ఎవరూ కోరుకోరు. దీనితో అత్యవసర గర్భనిరోధక మాత్ర మౌలిక లక్ష్యమే దెబ్బ తింటున్నది.
ఇండియాలో ఏటా 70 లక్షల గర్భస్రావాలు నమోదవుతున్నాయి. గర్భస్రావం సంబంధిత దుష్ప్రభావాలతో 20 వేల మంది మహిళలు మరణిస్తున్నారు. ఈ గర్భస్రావాలు ప్రతి ఐదింటిలో రెండు మాత్రమే సురక్షితమైనవి. ఇక అరక్షిత సెక్స్ అనంతరం సాధ్యమైనంత త్వరగా అత్యవసర గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలి తప్ప 72 గంటలు దాటిన తరువాత కాదు. వీటి విచక్షణారహిత వాడకానికి వ్యతిరేకంగా డాక్టర్లు తీవ్రంగా ప్రచారం చేయాలి. కాగా, క్రితం సంవత్సరం ఇండియాలో సుమారు 82 లక్షల మాత్రలు అమ్ముడుపోయాయి.
ఈ మాత్ర గురించిన అపోహలలో ఒకటి ఇది గర్భస్రావం మాత్రకు సమానమనేది. కాని, అది నిజం కాదు. ఎందుకంటే గర్భధారణ నిర్థారణ జరిగే లోపల ఈ అత్యవసర గర్భనిరోధక మాత్ర నిర్దుష్ట వ్యవధిలో పని చేస్తుంది. అత్యవసర గర్భనిరోధక మాత్ర గర్భాన్ని అడ్డుకునేదే తప్ప గర్భస్రావం చేయించేది కాదు. ఐ-పిల్ విషయంలో దాని పని తీరును గురించి సరైన అవగాహన కొరవడడం వల్ల మహిళలు దైనందిన వ్యవహారంగా వాటిని మామూలు గర్భనిరోధక మాత్రలుగా మింగుతున్నారు.
మామూలు గర్భ నిరోధక మాత్రలు లేదా గర్భ నియంత్రణ మాత్రల కన్నా ఇసిల డోసేజి అధికం అనే సంగతి ప్రజలకు అర్థం కాదు. అందువల్ల కుటుంబ నియంత్రణ పద్ధతిగా వీటిని దైనందిన కార్యక్రమంగా వేసుకోరాదు.
Pages: -1- 2 News Posted: 4 March, 2010
|