'టీ' కోసం మందు త్యాగం అంతే ఊరి జనంలో చైతన్యం రగిలింది. తెలంగాణ సాధించేవరకు మద్యం తాగి సీమాంధ్ర వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు పన్నులు కట్టరాదని తీర్మానించుకున్నారు. మద్యం మానేయాలని ఒట్టు పెట్టుకున్నారు. అంతేకాదు ఈ ఒట్టు తీసి గట్టు మీద ఎవరైనా పెడితే వారికి కఠినమైన శిక్ష ఉంది. గుండు గీసి ఊరంతా గాడిద మీద ఊరేగించడం ద్వారా మద్యం తాగిన వ్యక్తిని శిక్షించాలని కూడా తీర్మానించుకున్నారు.
ఊరి ప్రజలతో మద్యం మానిపించడం తన లక్ష్యం కాదని సాప్ట్ వేర ఇంజనీరు కృష్ణం రాజు చెబుతున్నారు. తెలంగాణ సాధించడం ఉమ్మడి లక్ష్యమని, అందులో బాగంగానే స్వీయ మద్యపాన నిషేధ ఉద్యమం చేపట్టాలని భావించామని చెప్పారు. తాము మద్యం సేవిస్తుండటంతో తెలంగాణ ప్రాంతం నుండి ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నుచేరుతోందని, దీనిని అడ్డుకోవడానికే తాము మద్యం మానాలని నిర్ణయం తీసుకున్నట్లు మహ్మద్ పాషా అనే వ్యక్తి చెప్పాడు. 'మద్యం తాగడం ద్వారా ఆంధ్రా పాలకులకు ఆదాయం వెళ్లరాదని, సహాయనిరాకరణ చేయాలని మేం తీర్మానించుకున్నాం' అని 35 ఏళ్ల మహ్మద్ అక్రమ్ అనే రైతు చెప్పారు.
అలాగే తమ గ్రామంలో ఇక మద్యం ముట్టుకునేది లేదని, ఓ సారి నిర్ణయించామంటే ఇక అమలు జరగాల్సిందేనని గ్రామానికి చెందిన వెంకయ్య అనే వ్యక్తి చెప్పారు. మా ఊరు పొరుషానికి పెట్టింది పేరు, పౌరుషానికి ప్రతీకైన సర్వాయి పాపా రాయుడు(పాపన్న) పుట్టిన నేల మాది అని ఆయన వివరించాడు. తెంలగాణ కేసం తమ పౌరుష ప్రతాపం ఏమిటో చూపుతామని వెంకయ్య వ్యాఖ్యానించాడు. మద్యానికి స్వస్తి పలకాలన్న తమ నిర్ణయంతో మిగిలిన గ్రామ ప్రజలు కూడా స్ఫూర్తి పొందాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పాడు.
Pages: -1- 2 News Posted: 4 March, 2010
|