అతివల తహతహ సాహితీ విమర్శకుడు, బెంగళూరు విశ్వవిద్యాలయంలో కన్నడ ప్రొఫెసర్ బసవరాజ్ కాల్గుడి ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడచిన రెండు దశాబ్దాలలో మహిళల్లో తమ మాట నెగ్గించుకోవాలనే ధోరణి ప్రబలడం వల్ల పితృస్వామ్య సమాజంలో వారిపై ద్వేషభావం ఇంకా పెరిగిందని పేర్కొన్నారు. 'మౌనమే భాష' అయిన మహిళలు ఇప్పుడు తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరుకుంటున్నారని, అయితే, సాంప్రదాయక సమాజం ఈ స్వతంత్ర వాతావరణానికి ఇంకా అలవాటు పడలేకపోతున్నదని ఆయన పేర్కొన్నారు. తమ జీవిత భాగస్వాములను స్వయంగా ఎంపిక చేసుకుంటున్నందుకు మహిళలు అంతకంతకు 'పరువు కోసం హత్యలకు' గురవుతున్నారు.
కాగా, నటి సుహాసినీ మణిరత్నం స్వీయానుభవాల నుంచి ప్రస్తావిస్తూ, 'ఆడపిల్లను అంతం చేయడానికి పేరొందిన తమిళనాడులోని ఒక ప్రాంతంలో పుట్టాను. నేను మా తల్లిదండ్రులకు మూడవ కుమార్తెను. నేను అవాంఛిత శిశువును కానని నిర్ణయించుకున్నందుకు మా తల్లికి నేను కృతజ్ఞురాలినై ఉంటాను' అని చెప్పారు. తన జీవితంలో తన భర్త, దర్శకుడు మణిరత్నంతో సహా కొందరు పురుషులు సకారాత్మక పాత్ర పోషించారని ఆమె చెప్పారు. 'మగవారికి వారి ఉపయోగాలు ఉంటాయి' అని ఆమె పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 5 March, 2010
|