మళ్లీ అశోకుని శకం! అంతే కాదు. దేశంలో 1991లో సరళీకరణ శకంలో మాత్రమే విమాన సర్వీసుల ప్రైవేటీకరణ జరిగి 1992లో జెట్ ఎయిర్ వేస్ స ంస్థ ఒక టాక్సీ ఆపరేటర్ గా సర్వీసులు నిర్వహించిందని ఎవరైనా భావిస్తే వారు మరొకమారు ఆలోచించుకోవాలి. 1948లోనే ప్రైవేట్ విమాన సంస్థలను అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకున్నది. తత్ఫలితంగా ఎయిర్ వేస్ (ఇండియా), దాల్మియా ఎయిర్ వేస్, హిమాలయన్ ఏవియేషన్, కళింగ ఎయిర్ లైన్స్, భారత్ ఎయిర్ వేస్ వంటి ప్రైవేట్ విమాన సంస్థలు కొన్ని రంగ ప్రవేశం చేశాయి.
భారత విమానయాన పిత జె.ఆర్.డి. టాటా గురించిన వివరాలతో ఒక విభాగాన్ని ఈ పెవిలియన్ లో ఏర్పాటు చేశారు. టాటా 1932లో టాటా ఎయిర్ లైన్స్ ను ఏర్పాటు చేసి దేశ ప్రజలకు మొదటిసారిగా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆయన కరాచి నుంచి బొంబాయికి తమ సంస్థ తొలి సర్వీసును నడిపారు. ఇక ఇప్పటి రోజులలో ముంబై - కోలకతా విమాన ప్రయాణానికి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నవారికి వెనుకటి రోజుల్లో ముంబై-కోలకతా నాన్ స్టాప్ విమానం టిక్కెట్ ధర రూ. 1700 మాత్రమే ఉండేదని తెలిస్తే ఆశ్చర్యం కలగవచ్చు. చరిత్రపై అభిమానం ఉన్నవారికి సంతోషం కలిగించే రీతిలో వెనుకటి తరం విమానం మోడల్స్ ను కూడా ప్రదర్శిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 6 March, 2010
|