విద్యుత్ సౌధ ముట్టడి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కాంలలో ఉన్న ఖాళీ పోస్టులను ప్రస్తుతం వాటిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు మంగళవారం ఉదయం విద్యుత్ సౌధను ముట్టడించారు. దీనితో ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ కార్యాలయం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఆందోళనకారులు విద్యుత్ సౌధలోకి చొచ్చుకు వెళ్ళేందుకు కార్మికులు ప్రయత్నించారు. ఆందోళకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో మళ్ళీ అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
News Posted: 10 February, 2009
|