'బేషరతు క్షమాపణ చెప్పాలి'
హైదరాబాద్ : కాంగ్రెస్ కార్యాలయం నిర్మాణం కోసం అర్ధంతరంగా అర్ధాత్రి ఖాళీ చేయించి, ఇళ్ళను కూల్చివేసినందుకు భీమ్ రావు బాడ కాలనీ వాసులకు కాంగ్రెస్ సర్కార్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఒక పక్కన ఇందిరమ్మ ఇళ్ళు అంటూనే మరో పక్క దారుణంగా పేదల ఇళ్ళను కూల్చివేస్తుండడం వైఎస్ సర్కార్ కే చెల్లిందని ఆయన దుయ్యబట్టారు. పేదల ఇళ్ళను కూల్చివేసిన భీమ్ రావు బాడలోనే వారికి మళ్ళీ పక్కా ఇళ్ళు కట్టించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భీమ్ రావు బాడ బస్తీ వాసుల విషయంలో మంగళవారంనాడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడిగా వేడిగా చర్చ జరిగింది. భీమ్ రావు బాడ బస్తీ సమస్యపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి.
News Posted: 10 February, 2009
|