ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్రిక్తత
హైదరాబాద్ః ఉప్పల్ సమీపంలోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫీజుల గురించి అడిగేందుకు వెళ్లిన తమపై యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడిందంటూ విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళనకు దిగారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థులు,యాజమాన్యం పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం కాలేజీకి చెందిన రెండు బస్సులు ధ్వంసం కావడంతో ఇది విద్యార్థుల పనేనని యాజమాన్యం అనడంతో ఇక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
News Posted: 11 February, 2009
|