టిఎల్సీఏ అధ్యక్షుడిగా వెంకటేష్
న్యూయార్క్ : న్యూయార్క్ తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ (టిఎల్సీఏ) కొత్త అధ్యక్షుడిగా వెంకటేష్ ముత్యాల ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన టిఎల్సీఏ సంక్రాంతి సంబరాల సందర్భంగా టిఎల్సీఏ కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. సంక్రాంతి సంబరాలకు సుప్రసిద్ధ నటుడు, హీరో వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అలాగే తెలుగు సినీ తారలు మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ఎల్ ఆర్ ఈశ్వరి, జమునా రాణి, గాయని సునీతలు కూడా ఈ వేడుకలలో పాలుపంచుకొని ప్రవాసాంధ్రులను పరవశంలో ముంచెత్తారు.
టిఎల్సీఏ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటేష్ ముత్యాల ఈ సందర్భంగా మాట్లాతుడూ, ఇప్పటి వరకు ఈ పదవిని నిర్వహించిన హేమా రెడ్డి సేవలను కొనియాడారు. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్ తన ప్రాధామ్యాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో కాలేజీ ట్యూషన్ ఫీజు చెల్లించలేక చదువును కొనసాగించడానికి సతమతమవుతున్న ప్రతిభావంతులైన పేద విద్యార్ధుల కోసం దాతల సహకారంతో స్కాలర్షిప్ ఫంఢ్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెంకటేష్ ప్రకటించారు. అలాగే సభ్యుల సహకారంతో గుప్పెడు మెతుకుల కోసం అల్లాడిపోతున్న వారిని ఆదుకునేందుకు ఫుడ్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. టిఎల్సీఏ కార్యకలాపాలలో యువత మరింతగా పాలుపంచుకునేలా కార్యక్రమాలను రూపొందించబోతున్నట్లు చెప్పారు.
1971లో స్థాపించి ఇప్పటి వరకు విజయవంతంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్న న్యూయార్క్ తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ మన్ముందు కూడా అనేక వినూత్మ కార్యక్రమాలు చేపట్టి ప్రవాసాంధ్రులకు ఆదర్శంగా నిలిచేందుకు ప్రతిన బూనింది.
కొత్తగా ఎన్నికైన టిఎల్సీఏ కార్యవర్గం
*అధ్యక్షులు.....వెంకటేష్ ముత్యాల
*ఉపాధ్యక్షులు....శ్రీనాధ్ జొన్నవిత్తుల
*కార్యదర్శి.....శివ ముతికి
*జాయిట్ సెక్రటరీ.....నాగేంద్ర గుప్తా
*ట్రెజరర్.....విక్రమ్ జంగం
*జాయింట్ ట్రెజరర్....శిరీష కొర్రపాటి
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు
*కృష్ణశ్రీ, గంధం * సత్య చల్లపల్లి * వోలేటి రావు * రాజ్యలక్ష్మి కుంచం * శ్రీనివాస్ గూడూరు * ధర్మారావు తాపీ
బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్
*అప్పారావు సుంకర * జానకీ రావు * జేమ్స్ కొమ్ము * ఉషా అరమళ్ళ * నిర్మల శాస్త్రి * దామ వెంకయ్య * డాక్టర్ మోహన్ బదే (లైఫ్ ట్రస్టీ) *డాక్టర్ గుజవర్తి కృష్ణారెడ్డి (లైఫ్ ట్రస్టీ
News Posted: 11 February, 2009
|