టమోట రైతుల ఆందోళ
హైదరాబాద్ : మదనపల్లికి చెందిన రైతులు టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో టమోటా రైతులు గురువారం అసెంబ్లీ ఎదుట టమోటాలను రోడ్డు పై పోసి ఆందోళనకు దిగారు.అధికార, ప్రతిపక్ష నాయకులు తమ ఆదాయాల లెక్కల గురించి ఆరోపణలు చేస్తూ రైతుల గురించి మర్చిపోయారని పిఆర్పి నేతలు ఆరోపించారు. ఆందోళనకారులు అసెంబ్లీలోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
News Posted: 12 February, 2009
|