ఎన్నారై `దేశం' పిలుస్తోంది..!
న్యూజెర్సీః `ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన సమయం ఆసన్నమయింది. మన పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి మనమేం చేయాలో చర్చించుకుందాం, ఆలోచనలు పంచుకుందాం' అంటూ ఎన్నారై తెలుగుదేశం పార్టీ మిషిగన్ విభాగం పిలుపునిచ్చింది. `మనకోసం తెలుగుదేశం' అనే నినాదంతో ఈనెల 21న ఫార్మింగ్టన్ హిల్స్ లోని సెయింట్ థామస్ బాంక్వెట్ హాల్ లో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటలదాకా జరిగే ఈ సమావేశంలో మూడు వేల మంది పాల్గొంటారని ఎన్నారై టీడీపీ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలుగుదేశానికి మద్దతు ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి అంటూ నిర్వాహకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వివరాలకు 248 470 6450, 248 470 1719 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

News Posted: 13 February, 2009
|