అన్నమయ్య పద విలక్షణత
టెక్సాస్ : తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలోని తెలుగు సాహితీ వేదిక నిర్వహించిన 19వ 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం స్థానిక ఆహార్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 50 మంది సాహితీ ప్రియులు హాజరయ్యారు. ఈ సమావేశానికి శ్రీమతి శారద పూర్ణ సొంటి ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీమతి శారద పూర్ణను తోటకూర ప్రసాద్ సభకు పరిచయం చేశారు.
శ్రీమతి శారద పూర్ణ 'అన్నమాచార్య పద సరస్వత విలక్షణత' అనే అంశం పై ప్రసంగించారు. తదుపరి అత్తలూరి విజయలక్ష్మి ఇప్పటి వరకు జరిగిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాలను సమీక్షించారు. తదుపరి రఘునాథరావు కొన్ని పద్యాలు చదివి వినిపించారు. తరువాత చంద్ర కన్నెగంటి తెలుగులో జంట పదాల గురించి విశ్లేషించారు. రాజు నక్తా అన్నమాచార్య సంకీర్తనల గురించి మరిన్ని విశేషాలు వినిపించారు. తరువాత కె.సి.చేకూరి వెండ్లూరి సుధాకర్ రచించిన గూర్ఖా కవితను వివరించారు. విశాల, వేదుల గౌరి అన్నమాచార్య కీర్తన 'తందనాన ఆహి తందనాన పురె' ఆలపించారు.
కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంత్ మల్లవరపు తెలుగు సంస్కౄతిలో భాగమైన తరాల తరాల ఆనవాళ్లను, వాటిని మన పిల్లలతో పంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముఖ్య అతిథిని పూర్ణ నెహ్రూ, బోయారెడ్డి సుభాషిణి శాలువతో సత్కరించారు. బిఓటి చైర్ రాం యలమంచిలి పుష్పగుచ్ఛంతో, సాహితీ వేదిక కార్యవర్గం జ్ఞాపికతో సత్కరించారు. సత్యం కల్యాణదుర్గ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
News Posted: 17 February, 2009
|