కాంగ్రెస్ లోకి లక్ష్మారెడ్డి
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ కోటకు ఇంకా ఇంకా బీటలు వారుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి బుధవారంనాడు ముఖ్యమంత్రి వైఎస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లాలో మంచి పలుకుబడి ఉన్న లక్ష్మారెడ్డి రాజీనామాతో టిడిపి కోటకు ముప్పు వాటిల్లినట్లే అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. విచ్చిన్నకర, సమైక్య వాదులతో పొత్తు కుదుర్చుకోవడాన్ని ప్రశ్నిస్తూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి లక్ష్మారెడ్డి ఇంతకు ముందు లేఖ రాసి సంచలనం సృష్టించారు. లక్ష్మారెడ్డి రాజీనామాతో చేవెళ్ళ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు రాజీనామాల పరంపరను కొనసాగిస్తున్నారు. మంగళవారం నాడే రాజేంద్రనగర్ మండలం టిడిపి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీకి 'రాం రాం' చెప్పేశారు.
News Posted: 18 February, 2009
|