హైదరాబాద్ : ప్రముఖ కవి దాశరధి రంగాచార్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాన్ని ఆయన స్వగృహంలో అయనకు అందజేశారు. ఈనెల 14న లలిత కళా తోరణంలో జరిగిన నంది అవార్డుల ప్రధానోత్సవంతో పాటు ప్రతిభా రాజీవ్ పుస్కారాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకులో దాశరధి కూడా ఉ్నారు. అనారోగ్య కారణాల వల్ల దాశరధి ఆ పురస్కారం స్వీకరించడానికి వెళ్ళలేకపోవడంతో ఐఏఎస్ అధికారి పార్థ సారధి దాశరధి ఇంటికి వెళ్లి ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.