హైదరాబాద్: పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దాడులకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న వారు శనివారం సికింద్రాబాద్ లోని సబ్ రిజిస్ట్రార్ క్యార్యాలయం అద్దాలను బయట ఉన్న సామాన్లను ధ్వంసం చేశారు. అంతేకాక అదే కాంప్లెక్స్ లో ఉన్న విద్యా డయాగ్నిస్టిక్ సెంటర్ పై కూడా దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.