నేడు మాతృభాషా దినోత్సవం
హైదరాబాద్ : అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా నేడు సచివాలయం ముందు ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎబికె ప్రసాద్ పూలమాలలు వేసి పుష్పాంజలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, కళాశాలల్లోనూ తెలుగుభాషకు ప్రాధాన్యం వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరభాషా వ్యామోహంలో పడి తెలుగుభాషను కాపాడుకోకపోతే వెనుకబడే అవకాశం ఉందని ఎబికె ప్రసాద్ పేర్కొన్నారు.
News Posted: 21 February, 2009
|