కిటకిట లాడుతున్న శైవక్షేత్రాలు
హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శంకరుడికి ఇష్టమైన సోమవారం రోజున శివరాత్రి పర్వదినం రాడవంతో భక్తులు ఓం నమ: శివాయ అంటూ, శంభోశంకర హర హర మహాదేవ అంటూ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ, ఆ స్వామిని దర్శించి తరిస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, విజయవాడ, అమరావతి, వేములవాడ, భీమవరం, పట్టిసీమ, కోటప్పకొండ, గోవాడ తదితర శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
News Posted: 23 February, 2009
|