మంటల్లో మార్కెట్ యార్డ్
హైదరాబాద్ : మలక్ పేట మార్కెట్ యార్డ్ లో ఉన్న గోనె సంచుల గోదాంలో సోమవారంనాడు మంటలు చెలరేగాయి.నగరం నడిమధ్యలో ఉన్న మహబూబ్ మాన్షన్ లోని గోదాంలో భద్రపరిచిన గోనెసంచులకు మంటలు అంటుకొని పెద్ద అగ్నిప్రమాదానికి దారితీసింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు, మార్కెట్ లోని వ్యాపారులు, కూలీలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదం వార్త తెలిసిన వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు వెళ్ళి మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. అగ్నికీలలు అదుపులోకి వస్తే గాని ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలను వెల్లడించలేమని అగ్నిమాపక దళం అధికారులు తెలిపారు.
News Posted: 23 February, 2009
|