రెయిన్ బోలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : స్థానిక నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో ఉన్న రెయిన్ బో హోటల్లో గురువారం అర్థరాత్రి దాటాక సంభవించిన భారీ అగ్ని ప్రమాదం భయాందోళనలు రేకెత్తించింది. ఈఘటనలో 40 మంది కస్టమర్లు చిక్కుకున్నారు. అర్థరాత్రి తర్వాత హోటల్ లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో కష్టమర్లు ఏం చేయాలో అర్థంకాక పలువురు కష్టమర్లు హోటల్ పైనుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. మరి కొంతమంది పరిస్థితి విషయమంగా ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ, గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
News Posted: 27 February, 2009
|