గాంధీ విగ్రహం ధ్వంసం
హైదరాబాద్ : గుర్తు తెలియని దుండగులు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన మంగళవారం ఉదయం తీవ్ర సంచలనం సృష్టించింది. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్ గూడలో ఈ దుశ్చర్యకు సోమవారం అర్ధరాత్రి దుండగులు పాల్పడ్డారు. అయితే, విగ్రహాన్ని ధ్వంసం చేసిన చోట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించిన కరపత్రాలు కొన్ని లభ్యమయ్యాయి. విగ్రహాన్ని ఎమ్మార్పియస్ కార్యకర్తలు ధ్వంసం చేశారా లేక మరెవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనేది తెలియలేదు. విగ్రహ ధ్వంసంతో హైదర్ గూడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భద్రతను పెంచారు.
News Posted: 2 March, 2009
|