హోలీ సంబరాలు
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బుధవారం హోలీ సంబరాలు జరపుకుంటున్నారు. చిన్నపెద్దా అనే తారతమ్యం లేకుండా రంగులు చల్లుకున్నారు. జంట నగరాల్లో భారీ ఎత్తున హోలీ సంబరాలు జరిగాయి. కోఠీ, నాంపల్లి, బేంగపేట ఇతర కాలనీల్లో తెల్లవారు జామునుండే హోలీ సంబరాలు ప్రారంభం అయ్యాయి. హోలీ పండగ ప్రజల జీవితాల్లో రంగులు నింపాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జిల్లాలో కూడా హోలీ సంబరాలు భారీ ఎత్తున జరిగాయి.
News Posted: 11 March, 2009
|