హైదరాబాద్ : హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డ వద్ద మోటారు వాహన అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మితిమీరిన వేగంతో బైక్ ను నడపడంతో వాహనం అదుపు తప్పి రోడ్ డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన యుకులను రాంనగర్ వాసులుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.