భాను ఎన్ క్లేవ్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : స్థానిక భాను ఎన్ క్లేవ్ లో గత అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. ఎర్రగడ్డ సమీపంలోని ఈ. ఎస్. ఐ ఆస్పత్రి దగ్గర హీరోహోండా షోరూమ్ లో దాదాపు 200 వాహనలు అగ్నికి ఆహుతయ్యాయి. నిన్న ఆదివారం కావడంతో మధ్యాహ్నం తర్వాత షోరూంను మూసివేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా షోరూంలో మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన వాచ్ మెన్ ఓనరుకు ఫోన్ చేయగా వారు ఫైరింజన్ కు, పోలీసలకు సమాచారం అదించారు. ఫైరింజన్ వారు రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
News Posted: 23 March, 2009
|