కోఠి కాలేజీలో ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : కోఠి ఉమెన్స కళాశాల హాస్టల్ లో గీతావాణి అనే ఎమ్మెస్సీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది. పరిస్థితి విషమించడంతో నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి గీతావాణిని తరలించారు. కళాశాల లెక్చరర్ వేధింపులే ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణమని తెలుస్తోంది. కాగా, విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటనపై కళాశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డిగ్రీ వరకూ తెలుగు మీడియంలో చదువుకున్న గీతావాణికి ఇంగ్లీషు సరిగా రాదని లెక్చరర్ నిందించినందుకు తీవ్ర మనోవేదనకు గురైన ఆ విద్యార్థిని ఈ చర్యకు పాల్పడినట్లు విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. దీనితో కోఠి ఉమెన్స్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను పిడిఎస్ యు విభాగం విద్యార్థులు ముట్టడించారు. ప్రస్తుతం కళాశాలలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
News Posted: 24 March, 2009
|