హైదరాబాద్ : డ్వాక్రా లీడర్ గా వుంటూ మహిళల్లో నమ్మకం కలిగేలా వ్యవహరించిన ఓ మాయలేడి పది లక్షల రూపాయలతో పరారైన సంఘటన అల్వాల్ లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే దేవీ భవానీ డ్వాక్రా లీడర్ గా ఉంటూ మహిళల్లో నమ్మకం కలిగించేలా వ్యవహరించేది. ఈ నేపథ్యంలో పావలా వడ్డీకి రుణాలు మంజూరు కావడంతో పది లక్షల రూపాయలను బ్యాంక్ నుండి డ్రా చేసుకుని ఉడాయించింది. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పరారీలో ఉన్న భవానీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.