నగరంలో ఉగాది సంబరాలు
హైదరాబాద్ : గాంధీ భవన్ లో నేడు శ్రీ విరోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవేడుకల్లో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో బిజీగా వుండే వారి కోసం శిల్పారామంలో తెలుగు సంప్రదాయ పండగును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం, స్త్రీల కోసం ప్రత్యేకంగా వస్త్రాధరణ పోటీలను, తోరణ అలంకరణ వంటి పోటీలను నిర్వహించనున్నట్లు శిల్పారామం సొసైటీ వారు ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక అధికారి జనార్థన్ రెడ్డి తెలిపారు. ఈరోజు శిల్పారామంకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఉగాది పచ్చడితో పాటు బొబ్బట్లను ఉచితంగా ఇవ్వునున్నట్లు ఆయన తెలిపారు. ఉగాది పండుగ కానుకగా శిల్పారామంలో పనిచేసే స్త్రీలకు పసుపు, కుంకుమలతో చీరలు పంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రిన్సిపాల్, సెక్రటరీలు ఐవీర్ కృష్ణారావు, లక్ష్మీపార్థసారథిలు హాజరు కానున్నారు.
News Posted: 27 March, 2009
|