మహిళ అరెస్ట్
హైదరాబాద్ : శివన్న దళానికి చెందిన నక్సలైట్ నంటూ బెదిరిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బోరబండ ప్రాంతానికి చెందిన జమ్మిని విజయలక్ష్మి మియాపూర్ లోని పారిశ్రామిక వేత్త నరసింహారావుకు ఫోన్ చేసి తాను శివన్న దళానికి చెందిన నక్సలైట్ నని 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేసి, డబ్బు ఇస్తానని ఆమెను నమ్మించి పిలిపించారు. జమ్మిని విజయలక్ష్మి, ఆమె భర్త పారిశ్రామిక వేత్త వద్దకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
News Posted: 3 April, 2009
|