హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట మండుటెండలో మసాల ఈరన్న నిరసన చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ టికెట్ నిరాకరించడంతో మసాల ఈరన్న గత మూడు రోజులుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా శుక్రవారం ఆయన నీరసించి స్పృహ కోల్పోవడంతో ఆయన్ను 108 వాహనంలో తరలించి అపోలో ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. చికిత్స చేయించుకున్నాక కొంత సేపటికి తెప్పరిల్లిన మసాల ఈరన్న మరలా తన నిరసన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు పిఆర్పి కార్యాలయానికి చేరుకున్నారు.