పోచమ్మ గుడిలో చోరి
హైదరాబాద్ : ఎర్రగడ్డ ప్రాంతంలో నల్ల పోచమ్మ గుడిలో చోరీ జరిగింది. దొంగలు అమ్మవారి విగ్రహంపై ఉన్న కిరీటం, ముక్కుపడక, త్రిశూలం, పట్టు చీరలు, సీడీ ప్లేయర్ మొదలగున్న వస్తువులను, హుండీని పగలగొట్టి నగదు దోచుకెళ్ళారు. ఆభరణాలలో రోల్డ్ గోల్డ్ నగలను ఆలయం లోనే వదిలేసి వెళ్ళారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 4 April, 2009
|