'రాజ్యం'ను వీడను: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీని వీడే సమస్యే లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. అధిష్టానం మాట నిలుపుకోలేకపోవడంతో ఆవేదన మాత్రమే వ్యక్తం చేశానని ఆమె పేర్కొంది. కృష్ణాజిల్లా నందిగామ సీటును ఆమె భర్త వెస్లీకి కేటాయించకపోవడంతో వాసిరెడ్డి పద్మ అధిష్టానంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్తకు సీటు రాక ఆవేదన మాత్రమే వ్యక్తం చేశానన్నారు. తాను పార్టీ తరపున ప్రచారం చేస్తానని, పార్టీనీ వీడే ప్రసక్తే లేదని ఆమె తెలిపారు.
News Posted: 4 April, 2009
|