రచయిత్రికి ప్రతిభా పురస్కారం
హైదరాబాద్ : రచయిత్రిగా పదవ సంవత్సరంలోనే కలం పట్టి దశాబ్దాలుగా పాఠకుల హృదయాల్లో ఆత్మీయ స్థానాన్ని పొందిన సుప్రసిద్ద రచయిత్రి కె.వి.కృష్ణకుమారికి ఈనెల 19న 2009 సంవత్సరానికిగాను ఉగాది సాహిత్య ప్రతిభా పురస్కారాన్ని మచిలీపట్నంలో ఇన్ననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వందలాది రచనలు, వివిధ పత్రికల్లో ప్రచురించబడగా, దశాబ్ద కాలంగా ఒక కాలం నుండి నిర్వహిస్తున్న రచయిత్రిలలో ఈమె ఒకరు. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలనెన్నింటినో అందుకున్న కృష్ణకుమారి ఇప్పటి వరకు సుమారు 60 నవలలు రచించారు.
News Posted: 6 April, 2009
|