హైదరాబాద్ : సీనియర్ ర్యాగింగ్ విద్యార్థుల ఆగడాలు శ్రుతి మించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటీ ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు గత కొన్ని రోజులుగా జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. వారి ఆగడాలకు అంతు లేకపోవడంతో సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దాంతో 11 మంది సీనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట చేసి విచారణ జరుపుతున్నారు.