డబ్బిస్తే ఓడించండి: జెపీ
హైదరాబాద్ : లోక్ సత్తా అభ్యర్థులు ఎక్కడైనా డబ్బు, మద్యం పంపిణీ చేస్తే వారిని ఓడించాలని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. భార్గవ, వంశీమోహన్ స్వరపరచిన లోక్ సత్తా పాటల సీడీని , ఎన్నికల గుర్తైన ఈల చిహ్నాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోక్ సత్తా సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు.
News Posted: 11 April, 2009
|