హైదరాబాద్ : భారత రత్న డా.బి.ఆర్. అంబేద్కర్ 119వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ ఉద్ద వున్న ఆయన విగ్రహానికి వివిధ పార్టీల నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటమే అంబేద్కర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని నేతలు అన్నారు.