హైదరాబాద్ : సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో ఓటు వేయడానికి వచ్చి క్యూలో నిలబడిన మహిళా ఓటరకు గుండె పోటురావడంతో అక్కడికక్కడే మరణించింది. వెంకటరమణమ్మ (65) అనే మహిళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గురువారం సికింద్రాబాద్ సితాఫల్ మండికి వచ్చింది. క్యూలో నిలబడిన ఆమెకు గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మరణించింది. దీంతో స్థానికులలో విషాదం నెలకొంది.