హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిదశ ఎన్నికలకు పోలింగ్ సమయం నాలుగు గంటలతోనే ముగిసిపోయింది. ఓటింగ్ సమయం దాటిపోయినప్పటికీ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరి ఉన్నారు. దీంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం గడువు విధించిన సమయం దాటిపోయినప్పటికీ నాలుగు గంటల లోపు క్యూలో ఉన్న ఓటర్ల కు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు.