పిఆర్పీ, బీజేబీ కార్యర్తల ఘర్షణ
హైదారాబాద్ : ఛత్రినాకలో తొలిదశ పోలింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన ఓటర్ల నుంచి స్లిప్ లను లాక్కునేందుకు బిజెపి కార్యకర్తలు ప్రయత్నించారని ఆరోపిస్తూ ప్రజారాజ్యం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనలో ఇరువర్గాలకు చెందిన కార్యర్తలు ఘర్షణకు దిగడంతో బిజేపీ కార్యకర్త గాయపడ్డారు. దీంతో పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఆ రెండు వర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
News Posted: 16 April, 2009
|