17 కేంద్రాల్లో రీపోలింగ్
హైదరాబాద్ : తొలివిడత పోలింగ్ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాతో పాటు మరికొన్ని కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాల ధ్వంసంతో పాటు, ఈవీఎంలు పని చేయకపోవడంతో తిరిగి 18న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐ.వీ.సుబ్బారావు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా అయిజలో ఎంపీపీ ప్రకాష్ గౌడ్ ఇంటిని గ్రామస్తులు రాళ్ళతో దాడి చేయడంతో అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శశిధర్ రెడ్డి అయిజను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
News Posted: 16 April, 2009
|